Namaste NRI

జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీం

మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం కన్నప్ప. ముఖేష్‌ కుమార్‌ దర్శకత్వం.  ఈ చిత్రాన్ని మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా బృందం ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో భాగంగా కేథార్‌నాథ్‌, బద్రీనాథ్‌, రిషికేశ్‌లను సందర్శించింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ పరమ శివుడి భక్తుడి కథతో కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా రిలీజ్‌కు ముందే మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విజువల్‌ వండర్‌గా ఆధ్యాత్మిక, భక్తి ప్రధాన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events