శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా మంచు విష్ణు రూపొందిస్తున్న చిత్రం కన్నప్ప. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా తెలియజేశారు. ప్రపంచ ప్రేక్షకులు మెచ్చేలా మేము ఎంతో ఇష్టంగా తీసిన కన్నప్ప టీజర్‌ను కేన్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఆవిష్కరించబోవడం ఆనందంగా ఉంది. మన భారతీయ చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు తెలియజేయడమే మా లక్ష్యం అని మంచు విష్ణు పేర్కొన్నారు.