Namaste NRI

సీఎం రేవంత్‌తో కరణ్‌ అదానీ భేటీ.. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్టు అదానీ గ్రూప్‌ తెలిపింది. పోర్ట్స్‌ సెజ్‌ సీఈవో, గౌతమ్‌ అదానీ పెద్ద కుమారుడు కరణ్‌ అదానీ, అదానీ ఏరోస్పేస్‌ సీఈవో ఆశిష్‌ రాజ్‌వంశీతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. అదాని గ్రూప్‌ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందుంటుందని అదానీ గ్రూప్‌ ప్రతినిధులు చెప్పారు. రాష్ట్రంలో ఏరోస్పేస్‌ పారుతోపాటు డాటా సెంటర్‌ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

ఈ  సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం కార్యదర్శి షానవాజ్‌ ఖాసిం, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress