Namaste NRI

కార్తికేయ 2 ట్రైలర్‌  రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నిఖిల్‌ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఇక ఇటీవలే విడుదలైన టీజరకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.  ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు తెలిపింది చిత్రబృందం. శ్రీకృష్ణుడి చరిత్రతో ముడిపడిన కథ ఇది. ఆ చరిత్రలోకి డా.కార్తికేయ చేసే ప్రయాణం ఆసక్తికరం.  కార్తికేయ తర్వాత ఆ కలయిక లోనే రూపొందిన ఈ చిత్రం అంచనాల్సి అందుకునేలా ఉంటుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్నాయి సినీ వర్గాలు. శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యమేనన్‌ తదితరులు నటించారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: కాళ భైవర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events