కార్తికేయ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012. నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. లౌక్య ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తూ స్పెషల్ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. మన బెదురులంక 2012 వరల్డ్ ఫేమస్ అయ్యేందుకు రెడీ అయింది అంటూ ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అయితే విడుదలయ్యేది ఏ రోజు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు.

ఈ చిత్రం నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ వెన్నెల్లో ఆడపిల్ల పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. విలేజ్ నేపథ్యంలో సాగే కథతో బెదురులంక 2012 వస్తోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బెదురులంక 2012 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతూ, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

