Namaste NRI

యుగాంతం కాన్సెప్ట్‌తో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయిన కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. సి.యువరాజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌  పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. తాజాగా చిత్ర టీజర్‌ను  హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.  దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ఎన్నిసార్లు సినిమా చూసినా నవ్వుతూనే ఉన్నాను. ఓటీటీల్లో వైవిధ్యమైన కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఒక కొత్త తరహా చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ఇటీవల నా సినిమాలు ఆశించిన ఆదరణ పొందలేదు. ఎలాంటి స్క్రిప్ట్ అయితే తిరిగి నాకు పేరొస్తుందో అలాంటి కథ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ కోసం చాలారోజులుగా ఎదురుచూశాను. ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు అనేది పరిశీలించాను.  గతంలో నా సినిమాలకు జరిగిన తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను.  ఎవరి ఇమేజ్ కోసం ఏ సన్నివేశం ఉండదు. ఒక్క ఘన విజయాన్ని ఇవ్వండని కోరుకుంటున్నా అన్నారు.  నాయిక నేహా శెట్టి మాట్లాడుతూ నా గత చిత్రం డీజే టిల్లు లో రాధిక పాత్రలో నన్ను ఆదరించారు. ఈ సినిమాలో చిత్ర క్యారెక్టర్లోనూ మెప్పిస్తాననే నమ్మకం ఉంది అని చెప్పింది. త్వరలో  విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events