అగ్ర హీరో కార్తీ సర్దార్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సాధించిన విషయం విదితమే. ఈ సినిమా సీక్వెల్‌గా సర్దార్ 2 సినిమా ప్రస్తుతం తెరకెక్కుతున్నది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయ్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత ఎస్. లక్ష్మణ్. కార్తీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

కార్తీ మ్యాసీవ్ మిషిన్ గన్ పట్టుకొని రగ్గడ్ లుక్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. కార్తీ పాత్ర ఈ సినిమాలో ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ పోస్టర్ చెబుతున్నది. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, సహనిర్మాత: ఎ.వెంకటేష్, నిర్మాణం: ప్రిన్స్ పిక్చర్స్.
