Namaste NRI

అథర్వ నుంచి కేసీపీడీ వీడియో సాంగ్‌

కార్తీక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అథర్వ. మహేష్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నూతలపాటి నరసింహం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కేసీపీడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కిట్టూ విస్సా ప్రగడ సాహిత్యాన్నందించిన ఈ పాటకు శ్రీచరణ్‌ పాకాల స్వరాలను సమకూర్చారు. గ్రామీణ వాతావరణంలో సహజంగా తెరకెక్కించిన ఆ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని, క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠను పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఇటీవల ఫోరెన్సిక్‌, క్లూస్‌ డిపార్ట్‌మెంట్‌ వారు తమ సినిమాను వీక్షించి ప్రశంసించారని నిర్మాత పేర్కొన్నారు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events