రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కిన కేసీఆర్ ( కేశవ చంద్ర రమావత్ ) సినిమాలోని తెలంగాణ తేజం పాటను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. రాకింగ్ రాకేశ్‌తోపాటు, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, జోర్దార్ సుజాత, సింగర్లు విహ, గీత, రచయిత సంజయ్ మహేశ్‌లు కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు తేజం పాటను కేసీఆర్ ఆవిష్కరించారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, సంతోశ్ కుమార్, మధుసుధనచారి, దేశపతి శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
