బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు బహ్రెయిన్‌లో ఘనంగా జరిగాయి. బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఎన్నారై బీఆర్‌ఎస్ సభ్యులంతా కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బహ్రెయిన్ శివాలయంలో పూజలు చేశారు. ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్, తిప్పారవేణి శ్రీనివాస్, పల్లపు రవీందర్, చిలుకూరి రాజలింగం, మరుపాక దేవయ్య, మారంపల్లి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.