ఖతార్ రాజధాని దోహాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖతార్ బీఆర్‌ఎస్ పార్టీ విభాగం అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఖతార్ శాఖ యువజన విభాగం ఉపాధ్యక్షుడు హఫీజ్ మహమ్మద్, సీనియర్ నాయకులు ఎల్లయ్య తాళ్లపెళ్లి, మక్సూద్ అలీ, అజీమ్ మహమ్మద్, అర్షద్ పాల్గొన్నారు.
