తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న దక్షిణాఫ్రికాలో ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ దేశ బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, డర్బన్ రాష్ట్రాల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న దక్షిణాఫ్రికాలోని మూడు రాష్ట్రాల్లోగల అనాథాశ్రమాల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
