Skip to main content

Namaste NRI

లతా రెడ్డిగా కీర్తి సురేష్.. బర్త్‌డే స్పెషల్ ఫస్ట్ లుక్ విడుదల

టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా జనవరి 12 విడుదల చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ సంక్రాంతికి ఆమె లతా రెడ్డి అనే సరికొత్త శక్తివంతమైన పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేశ్ హీరోగా, నందమూరి కల్యాణ్ రామ్ కీలక పాత్రలో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events