అమెరికా చట్టసభల సంయుక్త సమావేశాన్ని ఉద్ధేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎల్లవేళలా పటిష్టంగా ఉండేందుకు అమెరికా కాంగ్రెస్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని , ఈ నేపథ్యంలో తాను జాయింట్ సెషన్‌లో మాట్లాడనుండటం కీలకం అవుతుందని ప్రధాని వివరించారు. కేవలం ప్రభుత్వాలు అధికారిక వ్యవస్థల మధ్యనే కాకుండా ప్రజల మధ్య అనుబంధాలు దేశాల మధ్య స్నేహ వారధులను బిగుసుకునేలా చేస్తాయని తెలిపారు.

ఈ కోణంలో ఇరుదేశాల మధ్య వాడిపోని విశ్వాసం నెలకొంటుంది. భారత్ అమెరికా మధ్య ఇటువంటి పరిపూర్ణపు సహకారపు నమ్మకాల పయనం కేవలం ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రధాన విషయం అవుతుందన్నారు. ప్రవాస భారతీయులతో తాను ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించబోతున్నానని, ఇది తన మనస్సుకు బాగా ఆకట్టుకునే దశ అవుతుందని తెలిపారు. ఇండో అమెరికన్లు అమెరికాలో ఓ ప్రభావిత వర్గంగా ఉంది. ఈ శ్రేణులు మన అత్యున్నత విలువల సమాజాన్ని అక్కడ ప్రతిఫలిస్తున్నాయని, వారితో ముచ్చటించడం తనతో తానే మాట్లాడుకోవడం అవుతుందని అన్నారు.

