అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌ను కలుసుకున్నారు. చైనా, అమెరికాల వివాదాస్పద వ్యవహారాల నడుమ బ్లింకెన్ చైనాకు రావడం కీలక అంశం అయింది. తాను అమెరికా విదేశాంగ మంత్రితో భేటీ అయినట్లు ఆ తరువాత చైనా నేత తెలిపారు. రెండుదేశాల ఉన్నతస్థాయి దౌత్యవేత్తల నడుమ విస్తృతస్థాయి సంప్రదింపుల తరువాత కొన్ని నిర్థిష్ట అంశాలపై పరస్పర అవగాహన కుదిరిందని చైనా అధినేత తెలిపారు. చైనాలో రెండు రోజుల పర్యటన తుదిరోజున బ్లింకెన్ జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య సర్దుబాట్లు కుదిరినట్లు చైనా నేత తెలియచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.అయితే ఏఏ అంశాలపై అవగావహన కుదిరిందనేది తెలియచేయలేదు. బ్లింకెన్‌తో చర్చలు అత్యంత రహస్యంగా , చాలా లోతుగా జరిగాయని అధికారులు వెల్లడించారు.


