ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహిస్తున్నారు. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మన ఆహారపు అలవాట్లు వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే కార్యక్రమాలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.
మన పూర్వీకుల నుండి మనం ఎప్పుడూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల గురించి వినలేదు! ఆధునిక జీవనశైలితో మమేకమైన మనం ఇప్పుడు సెల్ ఫోన్ మరియు కంప్యూటర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉచితంగా తెచ్చుకుంటున్నాము. జూలై 8, శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు, మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ, డాక్టర్ ఖాదర్ వల్లి ఆధ్వర్యంలో చిరు ధాన్యాలు (మిల్లెట్స్) వాటి ఆరోగ్య ప్రాముఖ్యత అనే అంశంపై మహాసభలో ఓ సెమినార్ ను ఏర్పాటుచేశారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ సెమినార్ కు హాజరై ఖాదర్ వల్లి చెప్పే మిల్లెట్ ప్రయోజనాలను తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి…తానా మహాసభల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మీరంతా మహాసభలకు వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ లావు కోరుతున్నారు.
Register for tickets now!