Namaste NRI

ఖుదీరామ్‌ బోస్‌ టైటిల్‌ ను లాంచ్‌ చేసిన మాజీ ఉప రాష్ట్రపతి

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్‌ బోస్‌ జీవితం వెండితెరపైకి రానుంది. ఖుదీరామ్‌ బోస్‌ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్‌ జాగర్లమూడి నిర్మించారు.రాకేష్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌,  అతుల్‌ కులకర్ణి, నాజర్‌, రవిబాబు, కాశీ విశ్వనాథ్‌ ముఖ్య తారలు. విద్యాసాగర్‌ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ బెంగాలీ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. విడుదలకు సిద్ధమవుతునన ఈ బయోపిక్‌ టైటిల్‌ భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఖుదీరామ్‌ పాత్రను రాకేష్‌ చేశారు. ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు మణిశర్మ, ప్రొడక్షన్‌ డిజైనర్‌ తోట తరణి, స్టంట్‌ డైరెక్టర్‌ కణల్‌ కన్నన్‌, సినిమాటోగ్రాఫర్‌ రసూల్‌ ఎల్లోర్‌, ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేష్‌, డైలాగ్‌ రైటర్‌ బాలాదిత్య. ఇలా మంచి టెక్నీషియన్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో  ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని చిత్రబృందం పేర్కొంది. నాజర్‌, రవిబాబు, కాశీ విశ్వనాథ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంభాషణలు: బాలాదిత్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events