Namaste NRI

అమెరికాకు కిమ్‌ వార్నింగ్‌

అణు యుద్ధానికి తాము సిద్ధమే అని ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.  కొరియా యుద్ద వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో సైనిక చర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడిరచారు. అవసరం అయితే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఏడవ సారి అణ్వాయుధాన్ని పరీక్షించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కిమ్‌ ఇచ్చిన వార్నింగ్‌ కొత్త డౌట్స్‌కు తెరలేపింది.

                 ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే అత్యధిక స్థాయిలో మిస్సైళ్లను పరీక్షించింది. ఆ దేశంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 31 మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు. అయితే ఉత్తర కొరియాపై అమెరికా వ్యవహరిస్తున్న దూకుడు విధానాన్ని కిమ్‌ తప్పు పట్టారు. అగ్రరాజ్యం తీరు మారడం లేదన్నారు.  అమెరికా పెత్తందారుల్ని మన ఐడియాలజీ, సైనిక దళాలతో ఢీకొట్టాలన్నారు. అమెరికాతో ఎటువంటి సైనిక్య చర్యను ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉన్నామని, అవసరం అయితే న్యూక్లియర్‌ అటాక్‌కు కూడా రెడీగా ఉన్నట్లు కిమ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 2017లో చివరిసారి ఉత్తర కొరియా న్యూక్లియర్‌ టెస్ట్‌ నిర్వహించింది. అయితే ఇటీవల కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events