Namaste NRI

కిరణ్‌ అబ్బవరం దిల్‌ రూబా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

కిరణ్‌ అబ్బవరం  హీరోగా విశ్వకరుణ్‌ దర్శకత్వంలో రవి, జోజో జోస్‌, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మించిన చిత్రం దిల్‌ రూబా.ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడారు. దిల్‌రూబా  విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నెల 14 కాదు, 13 సాయంత్రమే ప్రీమియర్స్‌ వేస్తున్నాం. అంటే ఒకరోజు ముందుగానే దిల్‌ రూబా సక్సెస్‌ జర్నీ మొదలుకానుంది. 2గంటల 20 నిమిషాలు సినిమా ఎక్కడా బోర్‌ కొట్టదు. క లో కంటెంట్‌ని చూశారు. దిల్‌ రూబా లో కిరణ్‌ అబ్బవరంను చూస్తారు. విశ్వకరుణ్‌ నన్ను చూపించిన విధానం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఉమెన్‌పై రెస్పెక్ట్‌తో ఈ సినిమా చేశాం. ఈ న్యూ ఏజ్‌ కమర్షియల్‌ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ అనేది ఇప్పుడే చెప్పలేని కానీ, సమయాన్ని మాత్రం వృథా చేయదు అని కిరణ్‌ అబ్బవరం అన్నారు.

అందరూ ప్యాషన్‌తో వర్క్‌ చేయడం వల్లే ఇంత మంచి అవుట్‌పుట్‌ వచ్చిందని, ఇందులోని కిరణ్‌ డైలాగులు, ఫైట్స్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటాయని, ఇందులో కొత్త కిరణ్‌ అబ్బవరంని చూస్తారని దర్శకుడు విశ్వకరుణ్‌ తెలిపారు. ఇంకా హీరోయిన్లు రుక్సర్‌ థిల్లాన్‌, క్యాతీ డేవిసన్‌, నిర్మాతలు రవి, రాకేష్‌రెడ్డి, డీవోపీ డేనియల్‌ విశ్వాస్‌తోపాటు చిత్ర యూనిట్‌ మొత్తం మాట్లాడారు.

Social Share Spread Message

Latest News