కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క. నయన్ సారిక, తన్వీరామ్ కథానాయికలు. సుజీత్, సందీప్ కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. చాలా కొత్త కంటెంట్‌తో క సినిమా చేశాను. ఫస్ట్‌సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ సినిమా కొత్తగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే యూనిక్‌గా ఉంటుంది. క లో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఇందులో సీజీ వర్క్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సినిమా బాగా రావడానికి కారణం అద్భుతమైన టీమ్ కుదరడమే. దీపావళికి మిమ్మల్ని బాగా ఎంటైర్టెన్ చేసే సినిమా క అని నమ్మకంతో చెప్పారు.
ఓ కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇదని, ఇందులో కిరణ్ కొత్తగా కనిపిస్తాడని దర్శకులు చెప్పారు. ఇందులో సత్యభామ అనే బ్యూటిఫుల్ రోల్ చేశానని కథానాయిక నయన్ సారిక అన్నారు. ట్రైలర్‌కి వందరెట్లు గొప్పగా సినిమా ఉంటుందని, కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇదని నిర్మాత పేర్కొన్నారు. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.