కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం కె-ర్యాంప్. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇన్‌స్టా ఆపేశానే.. ట్విట్టర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా అంటూ సాగే ఈ పాటను సురేంద్ర కృష్ణ రాయగా, చేతన్ భరద్వాజ్ స్వరపరచి సాహితీ చాగంటితో కలిసి ఆలపించారు. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మంచి బీట్‌తో ఈ పాట రూపొందించామని, కేరళ ఓనమ్ పండుగ సందడంతా ఈ పాటలో కనిపిస్తుందని, కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా మాస్ స్టెప్పులు ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాలో నరేష్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 18న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, నిర్మాణం: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్.















