
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 8వ తెలుగు సంబరాల ఈవెంట్ జూలై 4 నుంచి 6 వరకూ అమెరికాలోని టంపాలో ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా నాట్స్ 8వ తెలుగు సంబరాలు కార్యక్రమ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

జూలైలో జరిగే ఈ సంబరంలో పలువురు తెలుగు కవులు, కళాకారులు, నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతారని, దాదాపుగా పదివేల మంది ఈ సంబరాల్లో పాల్గొంటారని, రాబోయే 15ఏండ్లలో ఎలా ముందుకెళ్లాలో ముందే ప్రణాళికలు వేసుకున్నామని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వినర్, పూర్వపు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలతో పాటు నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్‌శంకర్, మెహర్మ్రేశ్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
