Skip to main content

Namaste NRI

జూలై 4 నుంచి నాట్స్‌ సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) 8వ తెలుగు సంబరాల ఈవెంట్‌ జూలై 4 నుంచి 6 వరకూ అమెరికాలోని టంపాలో ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా నాట్స్‌ 8వ  తెలుగు సంబరాలు కార్యక్రమ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

జూలైలో జరిగే ఈ సంబరంలో పలువురు తెలుగు కవులు, కళాకారులు, నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతారని, దాదాపుగా పదివేల మంది ఈ సంబరాల్లో పాల్గొంటారని, రాబోయే 15ఏండ్లలో ఎలా ముందుకెళ్లాలో ముందే ప్రణాళికలు వేసుకున్నామని నాట్స్‌ ఛైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేని తెలిపారు.

ఈ  కార్యక్రమంలో  ఈవెంట్‌ కన్వినర్‌, పూర్వపు ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ, నాట్స్‌ ఛైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేనిలతో పాటు నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్‌శంకర్‌, మెహర్మ్రేశ్‌, సంగీత దర్శకుడు తమన్‌, గీత రచయితలు చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News