నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి మూడోసారి నియమితులయ్యారు. ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో ఓలి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అస్థిరతకు మారుపేరైన నేపాల్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఓలి ముందున్న అతిపెద్ద సవాల్. నేపాల్-యునైటెడ్ మార్క్సి స్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్‌సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ నియమించారు. ఓలి, అతని మంత్రివర్గం నేడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాగా ఓలి గతంలో 2015-16, 2018-2021 కాలంలో ప్రధానిగా పనిచేయగా, ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టనున్నారు.