ఆశిష్‌గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హద్దు లేదురా. రాజశేఖర్ రావి దర్శకత్వం. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ సంయుక్తంగా వీరేష్ గాజుల నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సినిమా థీమ్ వైవిధ్యంగా ఉందన్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ అలనాటి కృష్ణార్జునులు స్నేహితులైతే ఎలా ఉంటారో తెలిపే చిత్రమిది. కథ, కథనాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం అన్నారు. స్నేహం గొప్పతనాన్ని ఈ తరం వారికి తెలియజెప్పేలా ఈ సినిమా కథ ఉంటుందని హీరో ఆశిష్‌గాంధీ పేర్కొన్నారు.
