Namaste NRI

మలేషియాలో ఘనంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

మలేషియాలో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఘనంగా చేశారు. అనంతరం మలేషియా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మారుతీ కుర్మ మాట్లాడుతూ కేటీఆర్‌ హయాంలో తెలంగాణకు భారీగా ఐటీ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో టైర్‌-2 పట్టణాలకు ఐటీ హబ్‌లను విస్తరింపజేశారని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాసులు, మలేషియా బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News