Namaste NRI

ఆస్ట్రేలియాలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన వేడుకలు  ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో  సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిడ్నలో రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రాజేష్ రాపోలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి 10 సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ ను సాధించే దిశగా కృషి చేసిన కేటీఆర్‌ పాత్ర చరిత్లో నిలిచిపోతుందన్నారు.  పార్టీ ఓడిన, గెలిచిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎప్పటికీ పార్టీ తోనే ఉంటుందని తెలిపారు.

గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా సిడ్నీలో రవీందర్ చింతామణి ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు రవీందర్ చింతామణి, పరశురాం ముత్తుకూల్ల, చిరాన్ పురంశెట్టి, మధుకర్ సుతారి, శ్రీనివాస్ సుతారి, రాజకుమార్ నరేట్టి,   లివింగస్టన్ చిట్టిపల్లి, సాయి గుప్త  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News