నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కుబేర. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ముంబయిలో పీ పీ డుమ్ డుమ్ అనే గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రష్మిక మందన్న గత చిత్రాల వసూళ్లను ఉద్దేశించి మీరు ఆమె ఫిల్మోగ్రఫీని గమనించారా? కలెక్షన్ల విషయంలో ఆమె మా అందరినీ బీట్ చేసింది అని అన్నారు.

నేను నటించిన శివ, క్రిమినల్ చిత్రాలను హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. శేఖర్ కమ్ములతో 15ఏళ్లుగా పనిచేయాలనుకుంటున్నా. ఇప్పుడు కుదిరింది. ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్. కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ధనుష్ ప్రతీ సినిమాలో వైవిధ్యం చూపిస్తుంటారు. ఈ మూవీలో ఆయన అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరిచారు అన్నారు.

ఈ సినిమాలో తాను బిచ్చగాడి పాత్రలో కనిపిస్తానని, ఇలాంటి పాత్రను ఇప్పటివరకు చేయలేదని, గొప్ప ఫిలాసఫీతో కూడిన కథ ఇదని ధనుష్ తెలిపారు. రష్మిక మందన్న మాట్లాడుతూ రియల్ లోకేషన్స్‌లో షూటింగ్ జరిపాం. నా క్యారెక్టర్ మీ అందరిని సర్‌ప్రైజ్ చేస్తుంది. పుష్ప, యానిమల్, ఛావా తరహాలో నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
