నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం కుబేర. రష్మిక మందన్న కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాల్ని చర్చిస్తూ సందేశాత్మక కథతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని అనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేశారు.

దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. సమాజంలోని ఆర్థిక అంతరాలు, అవినీతి వంటి అంశాలను చర్చిస్తూ లోతైన భావాలతో ఈ పాట సాగింది. హైదే కార్తీ, కరీముల్లా ఆలపించిన ఈ పాటలో ధనుష్, నాగార్జున పర్‌ఫార్మెన్స్ ఎమోషనల్‌గా సాగింది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
