Namaste NRI

కువైత్ మరో కీలక నిర్ణయం

కువైత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం  నుండి ప్రయాణీకులను పికప్ చేసుకుంటున్న అక్రమ డ్రైవర్లను తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి షేక్ తలాల్ అల్-ఖలేద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎయిర్‌పోర్టులో తనిఖీలు కఠినతరం చేయాలని సూచించారు. విమానాశ్రయంలో క్రమం తప్పకుండా సోదాలు నిర్వహించడం, అక్రమ డ్రైవర్ల ను గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు వెంటనే దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్ట్‌లో ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను 24 గంటలు మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రవాస డ్రైవర్లు  ప్రయాణీకులను చట్టవిరుద్ధంగా పికప్ చేయడం ద్వారా ఆ విమానాశ్రయ ట్యాక్సీ యజమానుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎయిర్‌పోర్ట్ టాక్సీ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు తాజాగా కువైత్ ఈ నిర్ణయం తీసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress