Namaste NRI

కువైత్ కీలక నిర్ణయం.. ఇకపై

వీసా మోసాలను అరికట్టేందుకు గల్ఫ్ దేశం కువైత్  కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఫోర్జరీ, వీసా ట్రాఫికింగ్‌ను   నివారించేందుకు ప్రత్యేకంగా కువైత్‌ వీసా  పేరిట యాప్‌ను తీసుకువస్తుంది. అతి త్వరలోనే యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.  ఈ మేరకు మొదటి ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి, తాత్కాలిక డిఫెన్స్ మినిస్టర్ షేక్ తలాల్ అల్ ఖలేద్ కీలక ప్రకటన చేశారు. ఇక ఎలక్ట్రానిక్ కువైత్ వీసా  అప్లికేషన్ అనేది కార్మికుడు వారి స్వదేశం నుండి విమానం ఎక్కే ముందు అన్ని ఎంట్రీ వీసాలకు చెల్లుబాటు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఈ యాప్ ఎప్పుడు అమలులోకి వస్తుందనే తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events