కువైత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్లు పునరుద్ధరించకూడదని కువైత్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలా చేయడం వల్ల మంచి నైపుణ్యం ఉన్న కార్మికులను కువైత్ కోల్పోతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి సరిjైున నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.