నయనతార రీసెంట్‌గా ఓ బాలీవుడ్ సినిమాకు నయన్ సైన్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ పైడిపల్లి వంశీ దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నది. ఇక నయన్ నటించిన తమిళ చిత్రం ముక్తీ అమ్మన్ సమ్మర్‌లో విడుదల కానుంది.

మెగాస్టార్‌తో ఆమె రీసెంట్ హిట్ మన శంకర వరప్రసాద్‌గారు టాలీవుడ్ రీజనల్ సినిమాల్లో నంబర్‌వన్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్.బి.కె. 111లో కథానాయికగా నటిస్తున్నది నయనతార. ఇక తమిళంలో అయితే ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి.















