యువ హీరో విశ్వక్‌సేన్ నటిస్తున్న తాజా చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో విశ్వక్‌సేన్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లోని కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన అచ్చు అమ్మాయిలా కనిపిస్తున్నారు. లేడీ గెటప్‌లోని సన్నివేశాలు చక్కటి హాస్యాన్ని పండిస్తాయని చిత్ర బృందం చెబుతున్నది. లైలా పాత్రలో విశ్వక్‌సేన్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందని, ఆయన కెరీర్‌లో ఇదొక వైవిధ్యభరితమైన చిత్రమని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, దర్శకత్వం: రామ్ నారాయణ్.