సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సలామ్. ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అతిథి పాత్రను పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. ఐశ్వర రజనీకాంత్ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈసినిమాను నిర్మిస్తోంది. ముంబయి నేపథ్యంలో క్రికెట్ ప్రధానంగా నడిచే ఈ కథలో మొయినుద్దీన్ భాయ్‌గా శక్తివంతమైన పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. భిన్న మతాలకు చెందిన ఇద్దరు మిత్రులకు క్రికెట్ అంటే ప్రాణం. అయితే మతం పేరుతో గొడవల వల్ల వారు ఆటకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ భాయ్ వారి మధ్య ఉన్న విద్వేషాలను ఎలా తొలగించాడు? ఇరు వర్గాలు సఖ్యతతో జీవించేందుకు ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశమని దర్శకుడు తెలిపారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తు న్నారు. ఇక ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించా రు. కానీ పలు కారణాల వల్ల లాల్ సలామ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం లేదు. కొన్ని వారాల క్రితమే డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కి స్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: సుభాస్కరన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్.