టాలీవుడ్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ కామెడీ వెబ్ సిరీస్ భామా కలాపం. అభిమన్యు తాడి మేటి తెరకెక్కించారు. ఈ సిరిస్ ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ భాషలో చేసినా ఆ భాషకి సరిపోతారు. ఇప్పుడు ఆమె చేస్తున్న భామా కలాపం అందరికీ నచ్చేలా ఉంటుంది అని అన్నారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ నలభై ఏళ్లుగ ఇండస్ట్రీలో అందరూ నన్ను ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్ తీసిన ఈ వెబ్ సిరీస్‌ని కూడా ఆదరించాలి అన్నారు. భామా కలాపంలో అనుపమ అనే చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను అన్నారు ప్రియమణి. ఈ కార్యక్రమంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్, భరత్ కమ్మ, జస్టిస్ ప్రభాకరన్ తదితరులు పాల్గొన్నారు.














