ప్రముఖ కోలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాలా భైరవ. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో లారెన్స్ సూపర్ హీరోగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రాఘవా లారెన్స్ కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను రమేష్ వర్మ పెన్‌మెట్సా దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ స్టూడియోస్ లిమిటెడ్, హవిష్ ప్రోడక్షన్ బ్యానర్‌లపై మనీష్ షా, కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌పై మరింత సమాచారం త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.