వెనిజులాలో నివసిస్తున్న తన పౌరులను వెంటనే ఆ దేశం విడిచి రావాలని అమెరికా సూచించింది. వెనిజులా సాయుధ దళాలు తమ దేశంలోని అమెరికా పౌరులను వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు భద్రతాపరమైన అలర్ట్ జారీ చేసింది. వెనిజులా ప్రభుత్వ అనుకూల మిలీషియాకు చెందిన సాయుధ సభ్యులు రోడ్లను దిగ్బంధించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారని, వాటిలో అమెరికా పౌరులు లేదా ఆ దేశ మద్దతుదారులు ఉన్నారేమో చూస్తున్నారని వార్తలు వస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.

వెనిజులాలో ఉంటున్న అమెరికా పౌరులు జాగరూకులై ఉండాలి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అని చెప్పింది. వెనిజులా నుంచి కొన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమైనందు న వెంటనే అక్కడి నుంచి బయటపడాలని సూచించింది. మదురో దంపతుల అపహరణ తర్వాత వెనిజులాలో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదో అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటన తెలియజేస్తోంది.















