కంబోడియాలో వీసాలకు సంబంధించిన కుంభకోణంలో చిక్కుకున్న 60 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతికి చిక్కిన వీరిని మే 20న కంబోడియాలోని జిన్‌బే-4 అనే ప్రాంతం నుంచి రక్షించారు. వీరిని క్షేమంగా మాతృదేశానికి తిరిగి పంపించే విషయాన్ని భారత దౌత్య కార్యాల య అధికారులు కంబోడియా అధికారులతో చర్చించారు. ఆ మేరకు ముందుగా అందరినీ కంబోడియా రాజధాని నామ్‌ఫెన్‌కు తరలించారు. అక్కడి నుంచి స్వదేశానికి పంపించే ప్రయాణ పత్రాలను దౌత్య వర్గాల సాయంతో సమకూర్చడానికి ఒక బృందం పనిచేస్తోంది. బాధితులను సాధ్యమైనంత త్వరగా భారత్‌కు పంపించడానికి ప్రయత్నిస్తున్నామని భారత దౌత్య కార్యాలయం ఎక్స్ లో పేర్కొంది.