విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా నటిస్తున్న సినిమా గ్రంథాలయం. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సాయిశివన్ జంపాన దర్శకుడు. కాలకేయ ప్రభాకర్, కాశీ విశ్వనాథ్, డాక్టర్ భద్రం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాతల మండలి అధ్యక్షులు కె. యల్. దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకులు బి. గోపాల్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయిశివన్ మాట్లాడుతూ సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. అర్థవంతమైన మాటలు, ఆకట్టుకునే ఫైట్స్ ఉంటాయి. ట్రైలర్ ను మంచి స్పందన వస్తున్నది. సినిమాకూ ఇలాంటి ఆదరణే ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం అన్నారు. సోనియా చౌదరి, అలోక్ జైన్, జ్యోతిరానా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సామల భాస్కర్, సంగీతం : వర్ధన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)