Skip to main content

Namaste NRI

గ్రంథాలయం ట్రైలర్ లాంచ్ ఈవెంట్

విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా నటిస్తున్న సినిమా గ్రంథాలయం. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సాయిశివన్ జంపాన దర్శకుడు.  కాలకేయ ప్రభాకర్, కాశీ విశ్వనాథ్, డాక్టర్ భద్రం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ  చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాతల మండలి అధ్యక్షులు కె. యల్. దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకులు బి. గోపాల్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా దర్శకుడు సాయిశివన్ మాట్లాడుతూ సరికొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. అర్థవంతమైన మాటలు, ఆకట్టుకునే ఫైట్స్ ఉంటాయి. ట్రైలర్ ను  మంచి స్పందన వస్తున్నది.  సినిమాకూ ఇలాంటి ఆదరణే ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం  అన్నారు. సోనియా చౌదరి, అలోక్ జైన్, జ్యోతిరానా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమవుతున్నది.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సామల భాస్కర్, సంగీతం : వర్ధన్.

Social Share Spread Message

Latest News