Namaste NRI

నచ్చింది గళ్‌ ఫ్రెండూ సక్సెస్‌ మీట్‌

ఉదయ్‌ శకంర్‌,  జెన్నీ హీరో హీరోయిన్లుగా నటించి కొత్త సినిమా నచ్చింది గాళ్‌ ఫ్రెండూ. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ మూవీస్‌ పతాకంపై అట్లూరి ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు.  గురు పవన్‌ దర్వకత్వం వహించారు. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిరు. నిర్మాత అల్లూరి నారాయణ రావు మాట్లాడుతూ  ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చిన్న చిత్రమైనా వైవిధ్యమైన కథ కథనాలతో రూపొందించారనే పేరు వచ్చింది. హదరాబాద్‌లో ప్రదర్శనలు పెంచుతున్నాం. సపోర్ట్‌ చేసిన మీ అందరికీ థాంక్స్‌ అన్నారు. దర్శకుడు గురు పవన్‌ మాట్లాడుతూ చిన్న సినిమాను పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్ని కేంద్రాల నుంచచి మంచి స్పందన  వస్తోంది. ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు మమ్మల్ని కట్టిపడేశావు అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్‌ చేయాల్సిన చిత్రమిది. ఆ థ్రిల్‌ ఫీలింగ్‌ ఓటీటీలో చూస్తే రావు అన్నారు. ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ  కంటెంట్‌ బాగుంటే చిన్న చిత్రమైనా ఆదిరిస్తారని మా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు.  సినిమా విడుదలైన అన్ని చోట్ల షోలు పెంచుతున్నారు. తెలుగులో నా తొలి చిత్రమిది అన్నారు  జెన్నీఫర్‌ ఇమ్యాన్యుయేల్‌

Social Share Spread Message

Latest News