Skip to main content

Namaste NRI

అలా చేస్తున్నందుకే భారత్‌పై … మరోసారి ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై తన ఆక్రోషం వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో అమ్మి భారీ లాభాలు ఆర్జిస్తుందని,  అలా చేస్తున్నందుకు భారత్‌పై మరిన్ని సుంకాలను గణనీయంగా పెంచనున్నట్లు తెలిపారు. భారత్‌ చమురును కొనుగోలు చేయడంతో,  రష్యా ఇంకా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని,  యుద్ధం వల్ల ఎంతో మంది చనిపోతున్నా భారత్‌ పట్టించుకోవడం లేదని ట్రంప్‌ ఆరోపించారు.

భారత్‌ భారీ మొత్తంలో రష్య చమును కొనుగోలు చేయడమే కాకుండా,  ఆ కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని బహిరంగ మార్కెట్‌లో భారీ లాభాలతో విక్రయిస్తుందని ఆరోపించారు. యుద్ధంలో ఉక్రెయిన్‌ పౌరులు చనిపోతున్నా భారత్‌కు పట్టింపు లేదని,  అందుకే భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచబోతున్నట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News