Skip to main content

Namaste NRI

చిత్రాలయం బ్యానర్ పై నిర్మాత వేణు దోనేపూడి కొత్త సినిమా షూరూ

టిను ఆనంద్‌, ఉపేంద్ర, జార్జ్‌ మరియన్‌, అక్షయ్‌, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి ప్రధాన పాత్రధారులుగా చిత్రాలయం స్టూడియోస్‌ పతాకంపై గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆదిశేషగిరిరావు క్లాప్‌ ఇవ్వగా, మరో నిర్మాత కేఎస్‌ రామారావు స్విచాన్‌ చేశారు.

ఇంకా నిర్మాతలు కేఎల్‌ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్‌, పరుచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్‌, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. నేపాల్‌ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయం అవుతున్నదని, త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అజయ్‌అబ్రహం జార్జ్‌, సంగీతం: స్టీఫెన్‌.

Social Share Spread Message

Latest News