మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ దీనికి నిర్మాత. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ టీనేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చాలా బాగుంటుంది కదా అని డిస్కషన్ చేస్తున్న టైమ్ లో లిటిల్ హార్ట్స్ టీజర్ నా దగ్గరకు వచ్చింది. ఈ టీజర్ లో చూపించినట్లు గల్లీలో కొట్లాటలు, ఇంట్లో పేరెంట్స్ తో చివాట్లు, అమ్మాయి చుట్టూ చక్కర్లు, ఎంసెట్ ఎగ్జామ్ టెన్షన్స్, ఇవన్నీ లైవ్ లీగా అనిపించాయి. హిట్టు కొట్టేశారనిపించేలా లిటిల్ హార్ట్స్ టీజర్. సినిమా టీజర్ నాకు బాగా నచ్చింది. ఈ కామెడీ మూవీ అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్‌లో బాగా ఎంజారు చేస్తారు. మంచి ప్రయత్నం చేశామని నమ్మకంతో మేమంతా ఉన్నాం అని అన్నారు. ఈ సినిమా చూసి మీరంతా థియేటర్స్‌లో కడుపునొప్పి పుట్టేలా నవ్వితే వాళ్లకు కడుపునొప్పి తగ్గేందుకు మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తాం (నవ్వుతూ) ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి చెప్పారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ ఈ సినిమాను ఇప్పటికి మూడుసార్లు చూశాను. మిమ్మల్ని థియేటర్స్‌లో నవ్వించడంలో ఎక్కడా ఫెయిల్ కాదు. ఇంటర్ చదివిన పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన చిత్రమిది. మీ పిల్లాడు బయట ఏం చేస్తున్నాడో మా మూవీలో చూస్తే తెలిసిపోతుంది అని అన్నారు.















