రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరుగులేని నాయకుడిగా నిలిచారు. ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో భారత్`రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను అని ప్రధాని మోదీ తెలిపారు.
