
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మా నాన్న సూపర్‌హీరో. అభిలాష్ రెడ్డి దర్శకత్వం. ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారా న్ని మొదలుపెట్టారు. సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియ జేస్తూ మధ్యతరగతి యువకుడి జీవన ప్రయాణం నేపథ్య కథాంశమిది. ప్రేమ, అనుబంధం తాలూకూ నిజమై న అర్థాన్ని తెలియజేస్తుంది. తండ్రీకొడుకుల అనుబంధానికి దర్పణంలా ఉంటుంది అన్నారు. ఈ మూవీలో సాయిచంద్, షాయాజీషిండే, రాజు సుందరం, శకాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి.
