తిరుమలలో శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని టీటీడీ మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉత్సవమూర్తులకు అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభా తం నిర్వహించాక శుద్ధి నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు పంచాగ శ్రవణం చేశారు. ఇవాళ రద్దు చేసిన ఆర్జిత సేవలు రేపటి నుంచి పునరు ద్ధరిం చనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.