Namaste NRI

భూతద్దం భాస్కర్‌ నారాయణ ఫస్ట్‌ గింప్స్‌

శివ కందుకూరి హీరోగా నటిస్తున్న చిత్రం భూతద్దం భాస్కర్‌ నారాయణ. రాశీ సింగ్‌ నాయిక. పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్‌ గింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ డిటెక్టివ్‌ కథే ఈ చిత్రం. ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే అంశాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి అని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌తో పాటు పాటల్ని విడుదల చేస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. అరుణ్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి, శివ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జంగాల స్నేహాల్‌, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిక్‌. ఛాయాగ్రహణం: గౌతమ్‌.జి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events