Namaste NRI

ముఫాసాకి మహేశ్ బాబు వాయిస్‌ ఓవర్‌

హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్‌ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది ది లయన్‌ కింగ్. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రీక్వెల్‌గా వస్తోంది ముఫాసా: ది లయన్‌ కింగ్. ఈ మూవీ డిసెంబ‌ర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైల‌ర్‌ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తెలుగు వెర్షన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వాయిస్ అందించాడు. తాజా సమాచారం ప్రకారం తెలుగు ట్రైలర్‌ ఆగస్టు 26న ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనుండగా,  ఈవెంట్‌ లో మహేశ్ బాబు సందడి చేయనున్నాడని సమాచారం. లయన్ కింగ్ సినిమాకు తెలుగుతోపాటు హిందీ ఆయా భాష‌ల్లో పలువురు న‌టులు డ‌బ్బింగ్ చెప్పారని తెలిసిందే. ఇక తెలుగు ల‌య‌న్ కింగ్ లోని సింబా పాత్ర‌కు నాని డ‌బ్బింగ్ చెప్పాడు.

ది లయన్‌ కింగ్‌లో మొద‌టి రెండు  పార్ట్‌లలో అడవికి రారాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండ‌డం అత‌డికి సింబా అనే కుమారుడు జ‌న్మించ‌డం చూడ‌వ‌చ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడ‌వి కి రాజుగా అస‌లు ఎలా ఎదిగాడు అత‌డికి సోదరుడు ఉన్న టాకా ఎలా చ‌నిపోయాడు? అలాగే ముఫాసా చంపా ల‌ని చూస్తున్నా స్కార్ ఏం చేశాడు? అనేది సినిమా స్టోరీ. ఫొటో రియలిస్టిక్‌ టెక్నాలజీతో వ‌స్తున్న ఈ సినిమా కు అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్‌ దర్శకుడు ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events